తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ మరో ముందడుగు 

by srinivas |
somu veerraju
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది. ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార కమిటీ ఏర్పాటు చేసింది. అంతేకాదు తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇనార్జిలను నియమించింది. ప్రచార కమిటీకి కన్వీనర్ గా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని నియమించింది.

ఈ కమిటీలో సభ్యులుగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావులతోపాటు కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్‌బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్ రాంభొట్లను నియమించారు. అలాగే దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఎక్స్ అఫిషియో ఆహ్వానితులుగా మురళీధరన్, సునీల్ దేవధర్, సోము వీర్రాజు, నూకల మధుకర్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పేర్లను ప్రకటించారు.

ఇకపోతే నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. సర్వేపల్లి-బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గూడూరు- పసుపులేటి సుధాకర్ రెడ్డి, వెంకటగిరి-సూర్యనారాయణ, సూళ్లూరుపేట-వాకాటి నారాయణరెడ్డి, సత్యవేడు-చిన్నం రామకోటయ్య, శ్రీకాళహస్తి-సైకం జయచంద్రారెడ్డి, తిరుపతి-డా. పార్థసారథిలను నియమించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత జనసేన పార్టీకి చెందిన సమన్వయ కమిటీ వివరాలు ప్రకటిస్తారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed