- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘చంబల్ ఫెర్టిలైజర్స్‘ ఎరువులను ఆవిష్కరించిన ఏవో
దిశ, పరకాల: భారతదేశంలోనే అతి పెద్ద ఎరువుల కంపెనీలలో ఒకటైన కెకె బిర్లా గ్రూప్ కి చెందిన చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉత్తం బ్రాండ్ పేరుతో గత 27 ఏళ్లుగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానా లతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉత్తమమైన ఎరువులను రైతులకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పరకాల అరుణ ఫెర్టిలైజర్స్ కంపెనీ డీలర్ షిప్ పొందడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నూతన ఎరువుల బస్తాలను పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చంబల్ కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ సుకుబీర్ సింగ్, పెస్టిసైడ్స్ కేటగిరి సురేష్ చంద్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నుండి తెలుగు రాష్ట్రాల రైతాంగానికి కూడా ఉత్తం బ్రాండ్ పేరుతో ఉత్తం డీఏపీ, ఉత్తం పొటాష్, ఉత్తం 20:20:013, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఇందులో భాగంగానే పరకాల అరుణ ఫర్టిలైజర్స్ నందు అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు.
రానున్న రోజుల్లో యూరియా, పొటాష్, ఎరువులు అందుబాటులోకి వస్తాయని ఎరువుల డీలర్లు కంపెనీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ హేమంత్, అరుణ ఫెర్టిలైజర్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు, సూర్యదేవర సదానందం, ఎర్రం లక్ష్మణ్, దేవా సతీష్, కొండ్ల విజయ్, పరకాల ఎరువుల దుకాణం యజమానులు పలువురు పాల్గొనడం జరిగింది.