అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా పాజిటివ్

by Jakkula Samataha |
అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా పాజిటివ్
X

ముంబైలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అటు సామాన్యులను, ఇటు సెలబ్రిటీలను చుట్టుముట్టేస్తుండగా.. తాజాగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే అమితాబ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు కరోనా పాజిటివ్ అని తేల‌గా, నటి రేఖ సిబ్బందిలో ఒక‌రు కూడా కరోనా బారిన ప‌డ్డట్టు లేటెస్ట్‌గా వార్త‌లు వెలువడ్డాయి. తాజాగా బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్.. త‌న త‌ల్లి, సోద‌రునితో పాటు మరో ఇద్ద‌రికి కరోనా సోకింద‌ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో షేర్ చేస్తూ.. త‌న త‌ల్లి ‘దులారి’కి కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయని, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దులారికి ఆక‌లి లేకపోవడంతో పాటు నిద్ర కూడా సరిగా లేదని తెలిపారు. దాంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలిందన్నాడు. సోద‌రుడు, వ‌దిన‌, మేన‌కోడ‌లు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం త‌న త‌ల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గా, మిగ‌తా వారు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారన్నాడు. అయితే త‌న ఫ్యామిలీలో నలుగురికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అనుప‌మ్ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఇందులో ఆయ‌నకు నెగెటివ్ అని తేలింది.

Advertisement

Next Story