అనుభవలేమితో పొరపాటు చేశా: అనూ బేబీ

by Jakkula Samataha |
అనుభవలేమితో పొరపాటు చేశా: అనూ బేబీ
X

అను ఇమ్మాన్యూయల్… అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకుండా పోయింది ఈ భామకు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని “మజ్ను” సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చి పడ్డాయి. “అజ్ఞాత వాసి”లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన, “నా పేరు సూర్య”లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా నటించింది. కానీ రెండూ డిజాస్టర్ సినిమాలే. ఆ తర్వాత చైతూ “శైలజ రెడ్డి అల్లుడు”, గోపీచంద్ “ఆక్సిజన్” సినిమాలు చేసిన వర్క్ ఔట్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గి… కోలీవుడ్ ను నమ్ముకుంది. అక్కడ కూడా అదే జరిగినా… ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది.

అయితే సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో అన్ని అపజయాలే ఎదురుకావడానికి కారణం అనుభవలేమి అని చెబుతోంది అనూ బేబీ. కేవలం నా పాత్ర పరిధి మేర సినిమా కథ వినేదాన్ని అని… దీంతో కొన్ని సినిమాలు ఆడలేదని చెప్పింది. మంచి సినిమాలు వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ తప్పులను తెలుసుకుని.. మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నానంది.

కాగా గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉన్న అనూ బేబీ… “అల్లుడు అదుర్స్” సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా నభా నటేశ్ తనకు జోడీ కాగా… చిత్రంలో విలన్ రోల్ చేస్తున్న సోనూ సూద్ కు భార్య పాత్రలో అనూ కనిపిస్తుందని సమాచారం. మరి విలన్ కు భార్య పాత్ర ఎంచుకుని అనూ మళ్లీ తప్పు చేసిందా? లేక సరైన నిర్ణయం తీసుకుందా? చూడాలి మరి.

Tags : Anu Immanuel, Tollywood, Kollywood, Alludu Adurs

Advertisement

Next Story