‘అంతర్వేది’లో ఆరని ఆగ్రహజ్వాలలు..

by srinivas |   ( Updated:2020-09-08 02:55:36.0  )
‘అంతర్వేది’లో ఆరని ఆగ్రహజ్వాలలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్దం విషయంలో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఈ విషయంపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచే కొత్త రథం నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జిల్లా పాలనాధికారి, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన మంత్రి విచారణకు ఆదేశించారు.

అయినప్పటికీ గ్రామస్తులు, వీహెచ్‌పీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కూడా ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో రథం దగ్ధం విషయంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆలయ ఈవో చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో ఎర్రంశెట్టి భద్రాద్రి జీ రావును నియమించారు.

Advertisement

Next Story

Most Viewed