తెలంగాణాలో ఆగిపోనున్న మరో పథకం.. ?

by Anukaran |
ration
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యం, నగదు సాయం రెండు నెలలుగా నిలిచిపోయింది. జూన్ వరకు మాత్రమే రూ. 2వేలను బియ్యాన్ని ప్రైవేటు టీచర్లకు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.09 లక్షల మంది ప్రైవేటు టీచర్లు ప్రభుత్వ సాయం అందక రెండు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ సాయానికి పూర్తిగా తెరపడనుంది. ఈ లోపు పెండింగ్ లో ఉన్న జులై, ఆగస్ట్ నెలల ఆర్థిక సాయాన్ని అందించాలని తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షడు షబ్బీర్ అలీ డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు అన్ని ప్రైవేటు పాఠశాలలో టీచర్లందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాని విన్నవిస్తున్నారు.

Advertisement

Next Story