- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త వివాదం దేనికి సంకేతం?
దిశ, ఏపీబ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం పులుముకుంటోంది. ఇటీవల కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం అన్ని వర్గాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో మరో కొత్త సమస్య తెరపైకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అధికారుల తీరుపై ఏపీ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో అంతర్రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు మాట్లాడుతూ.. ఏపీ సరిహద్దుల్లోనే ఇసుక తవ్వకాలు జరిగాయని స్పష్టం చేశారు. అయితే, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న వేళ.. తెరపైకి వచ్చిన ఈ వివాదాలు సర్వాత్ర ఉత్కంఠ రేపుతున్నాయి.