అక్కడ మరోసారి కంపించిన భూమి.. పరుగులెత్తిన ప్రజలు

by Shyam |
అక్కడ మరోసారి కంపించిన భూమి.. పరుగులెత్తిన ప్రజలు
X

దిశ, నాగర్‌కర్నూల్: కందనూల్ జిల్లాలో మరోసారి భూకంపం అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. సోమవారం తెల్లవారుజామున 4:18 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లనుండి బయటికి పరుగులు తీశారు. గత కొన్ని రోజుల క్రింద నల్లమల అచ్చంపేట మున్ననూరు, అమ్రాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించి ఇళ్లలో సామాగ్రి చెల్లాచెదురుగా పడిన విషయం తెలిసిందే. మళ్లీ మరోసారి నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.

Advertisement

Next Story