శనీశ్వర ఆలయంలో అన్నదానం.. జడ్పీటీసీ సులక్షణ ప్రత్యేక పూజలు

by Sridhar Babu |
శనీశ్వర ఆలయంలో అన్నదానం.. జడ్పీటీసీ సులక్షణ ప్రత్యేక పూజలు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామంలోని శనీశ్వర ఆలయంలో.. ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. బుధవారం ఈ అన్నదాన కార్యక్రమానికి అశ్వాపురం మండల జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వరున్ని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో అశ్వాపురం మండలం నుంచే కాక దూరప్రాంత గ్రామాలకు చెందిన భక్తులు సుమారు 500 నుంచి 600 వరకు పెద్ద సంఖ్యలో అన్నదానంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గోగినేని వాసంతి, ఝాన్సీ, ఎక్కటి సత్యనారాయణరెడ్డి, పుల్లారెడ్డి, పున్నారెడ్డి, తోట అక్కిశెట్టి శ్రీను, కోటేరు కేశవరెడ్డి, పిట్ట శ్రీను, కాట్రాజ్ కొండల రావు, వీఆర్వో ప్రసాద్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story