ఐపీఎల్‌ 2022: డీల్స్ పూర్తి చేస్తున్న లక్నో జట్టు

by Shyam |
ఐపీఎల్‌ 2022: డీల్స్ పూర్తి చేస్తున్న లక్నో జట్టు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కొత్తగా చేరి లక్నో ఫ్రాంచైజీ చకచకా డీల్స్ ఫినిష్ చేస్తున్నది. లక్నో జట్టును వేలంలో గెలిచిన ఆర్పీఎస్జీ ఫ్రాంచైజీ కోసం అప్పుడే పనులు మొదలు పెట్టింది. ఇప్పటికే కేఎల్ రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. లక్నో జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించబోతున్నాడు. అలాగే జట్టు కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ గతంలో ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. అలాగే కేఎల్ రాహుల్‌తో కలసి పంజాబ్ కింగ్స్ టీమ్‌లో సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్నాడు. పంజాబ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నప్పుడే రాహుల్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో రాహుల్ సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నది. ఇక టీమ్ స్పాన్సర్‌గా ఒక అంతర్జాతీయ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ విషయం కొలిక్కి వచ్చే వరకు లక్నో జట్టు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని బీసీసీఐ ఆదేశించింది. అయితే తెరవెనుక ఒప్పందాలు జరిగినా లక్నో మాత్రం వెల్లడించడం లేదని తెలుస్తున్నది.

Advertisement

Next Story