- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైవీ సుబ్బారెడ్డి
దిశ, వెబ్ డెస్క్: బుధవారం మంగళగిరిలో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని.. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడామని చెప్పుకొచ్చారు. అలాగే తాను వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే.. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
Read More..
‘తిరుపతి లడ్డూలో అవినీతి జరిగింది.. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే’