- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: రాగ ద్వేషాలకు అతీతంగా పని చేసిన ప్రభుత్వం ఇదే..సీఎం జగన్
దిశ వెబ్ డెస్క్: నేడు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని.. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా.. కులమతాలకు అతీతంగా, ఏ పార్టీ అని చూడ కుండా, చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని, అర్హత ఉంటె వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ అని హర్షం వ్యక్తం చేశారు.
ఇక మీ బిడ్డ బటన్ నొక్కడం, అక్క చెల్లెమ్మల అకౌంట్ లోకి డబ్బులు జెమ అవ్వడం ఇలా తుగ్గలిలో 95% ఇల్లకు వైసీపీ లబ్ది చేకూర్చిందని పేర్కొన్నారు. ఎక్కడ లంచాలు లేకుండా.. వివక్షలు చూపకుండా ఇలా చేసే పరిస్థితి ఉంటుందని గత ఐదేళ్లకు ముందు ఎవరైనా మీతో చెప్పారా అని ప్రశ్నించారు. జన్మ భూమి కమీటీలు రాజ్యమేలుతున్న సమయంలో ఏ పని కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, సబ్సీడీ పైన ఇచ్చే లోన్లు కావాలన్న, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలనను ప్రజలు చూసారని టీడీపీని విమర్శించారు.
Read More..