- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YS Jagan vs Sharmila: వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖపై వైసీపీ కౌంటర్ లెటర్
దిశ, వెబ్‌డెస్క్: జగన్-షర్మిల వివాదం (YS Jagan vs Sharmila)పై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖకు ఈ రోజు (బుధవారం) వైసీపీ (YCP) కూడా ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దివంగత మహానేత వైయస్సార్ (YSR) భార్యగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తల్లిగా విజయమ్మగారిని తాము గౌరవిస్తామని, అయితే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ద్వారా ఆమె షర్మిల (Sharmila) ఒత్తిడికి లొంగిపోయారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నామంటూ రాసుకొచ్చారు. విజయమ్మ (YS Vijayamma) తన లేఖలో జగన్ (YS Jaganmohanreddy) బెయిల్ రద్దు కుట్రను ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఇది వివాదాన్ని పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘ఇది ముమ్మాటికీ చంద్రబాబుకు మేలు చేయడమే. ఇది విజయమ్మగారికి ధర్మమేనా..? ఇద్దరు బిడ్డల మధ్య తటస్థంగా ఉండాల్సింది పోయి ఆమె ఇలా పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. విజయమ్మ వ్యవహారంతో వైఎస్సార్ అభిమానులు కలత చెందారు. బాధపడుతున్నారు’’ అంటూ రాసుకొచ్చారు.
దివంగత మహానేత వైయస్సార్‌గారి భార్యగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డిగారి తల్లిగా శ్రీమతి విజయమ్మగారిని అమితంగా గౌరవిస్తాం. వైయస్సార్‌గారి కుటుంబ వ్యవహారంపై విజయమ్మగారు బహిరంగ లేఖ విడుదలచేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె… pic.twitter.com/vK3a3Ra2T8
— YSR Congress Party (@YSRCParty) October 29, 2024