Kadapa: డిసెంబర్ 3న కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు

by srinivas |   ( Updated:2023-11-18 14:45:44.0  )
Kadapa: డిసెంబర్ 3న కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు
X

దిశ, కడప: డిసెంబర్ మూడో తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలకు ఓటేస్తే ఆ ఓటు బీజేపీకి వేసినట్లేనన్నారు. బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ అని, ఈ ముగ్గురిని బీజేపీగ అభివర్ణించారు.


కడప కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, పోలవరం, ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చేందుకు జగన్ బస్సు యాత్ర అంటున్నారని, జగన్ నిన్ను నమ్మి ప్రజలు ఓటు వేయరని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed