Kadapa: గంజాయి రవాణా చేస్తున్న 11 మంది అరెస్ట్

by srinivas |   ( Updated:2023-03-24 15:31:26.0  )
Kadapa: గంజాయి రవాణా చేస్తున్న 11 మంది అరెస్ట్
X

దిశ, కడప: మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల పరిధిలో గంజాయి రవాణా, విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా స్మగ్లర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 23 కేజీల 950 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అంబురాజన్ మాట్లాడుతూ గంజాయి అమ్మినా, కొన్నా, దాచి ఉంచినా, అక్రమ రవాణా చేసినా నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసులు అమలు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Next Story