AP Politics:కడపలో న్యాయం గెలుస్తుందా! నేరం గెలుస్తుందా? :వైఎస్ షర్మిల

by Jakkula Mamatha |   ( Updated:2024-05-09 14:24:12.0  )
AP Politics:కడపలో న్యాయం గెలుస్తుందా! నేరం గెలుస్తుందా? :వైఎస్ షర్మిల
X

దిశ,కడప: ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది కడపలో న్యాయం గెలుస్తుందా ? నేరం గెలుస్తోందా ? కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్న కసరత్తు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైయస్ షర్మిల కోరారు. గురువారం పులివెందుల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక వైపు వైయస్సార్ బిడ్డ. ఆ వైపు వివేకా హత్య నిందితుడు పోటీలో ఉన్నారన్నారు .అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీగా ఉన్నారని, కడప స్టీల్ గురించి పట్టింపు లేదని విమర్శించారు. కడప స్టీల్ వైఎస్ఆర్ కల అని, ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదని అన్నారు.

వైజాగ్ స్టీల్ ఎట్లానో రాయలసీమకి కడప స్టీల్ అంత ప్రాధాన్యత ఉందని అన్నారు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారని చెప్పారు. కడప ప్రజల కోసం ఒక్క నాడు పోలేదని అన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని మేము చెప్పలేదని, సీబీఐ ఆరోపణలు ప్రకారమే మేము మాట్లాడుతున్నామన్నారు. వివేకాకి కొడుకులు లేరని, జగన్‌ను కొడుకులా చూశాడని, తండ్రి తర్వాత వివేకా తండ్రి అంతటి వాడని, అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారు. ఇది అన్యాయం కాదా? అని ఫైర్ అయ్యారు. జగన్ కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికేనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వివేకా కూతురు సునీత మాట్లాడుతూ వివేకా ను దారుణంగా హత్య చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు.

Read More..

ఎన్నికల వేళ..పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

Advertisement

Next Story

Most Viewed