- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: ఆ ఐదుగురు ఎమ్మెల్యేలే టాప్
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంత ఈనెల 29 వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.
మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు, సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, మహిళలు, గృహ సారధులు ప్రతి ఒక్కరూ ప్రతీ కుటుంబాన్ని కలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వ పాలనకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలియజేస్తున్నారు.
అనంతరం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తున్న వారి సంఖ్య 75 లక్షలు దాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఉన్నారు.
అలాగే రెండో స్థానంలో అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. మూడో స్థానంలో బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి ఉండగా నాలుగో స్థానంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక ఐదో స్థానంలో కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు ఉన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.