YS వివేకా మర్డర్ కేస్: సీబీఐకి MP Y. S. Avinash Reddy మరో లేఖ

by Satheesh |   ( Updated:2023-01-28 06:48:39.0  )
YS వివేకా మర్డర్ కేస్: సీబీఐకి MP Y. S. Avinash Reddy మరో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 28వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తాను ఇవాళ సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు. కేసు విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని.. దర్యాప్తు సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. అంతేకాకుండా విచారణ సమయంలో తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలన్నారు.

Also Read...

Nara Lokesh Padayatra Yuva Galam live Day -2

Advertisement

Next Story