ఢిల్లీ పర్యటనలో ఏపీసీసీ చీఫ్.. నేడు అధిష్టానంతో భేటీ.. దానికోసమేనా..?

by Indraja |   ( Updated:2024-03-08 14:12:14.0  )
ఢిల్లీ పర్యటనలో ఏపీసీసీ చీఫ్.. నేడు అధిష్టానంతో భేటీ.. దానికోసమేనా..?
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పార్టీల అధినేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల విషయంలో ఢిల్లీకి చేరారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఢిల్లీకి పయనమైయ్యారు.

నేడు ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. కాగా ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె అభ్యర్థుల ఎంపికపై పెద్దలతో చర్చించేందుకే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఇక నిన్న మొన్నటి వరకు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల నేతృత్వంలో మళ్ళీ ఊపందుకుంటోంది. అయితే రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయింది.

ఇక ప్రజల్లో పార్టీ పై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు వైఎస్ షర్మిల శాయశక్తులా ప్రయత్నిస్తోంది. సొంత అన్న అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఆంధ్రలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించు అంటూ నిలదీస్తోంది. జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటోంది.

ఇక ప్రత్యర్ధులు తనపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జల్లు కురిపిస్తున్న.. తన కార్యకలాపాలకు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి అడ్డువస్తున్న తాను మాత్రం వెనకడుగు వేయడంలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read More..

సీఎం జగన్ దూకుడు.. త్వరలో ఫైనల్ లిస్టు

Advertisement

Next Story

Most Viewed