మోడీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు..వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
మోడీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు..వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో నిర్వహించిన ఏపీ న్యాయ యాత్ర సభలో షర్మిల మాట్లాడుతూ..ఉద్యోగాల కోసం యువత వలస వెళ్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని షర్మిల అన్నారు. పదేళ్లలో 10 పరిశ్రమలు అయినా వచ్చాయా? అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమం చేశారా అని మండిపడ్డారు. ఈ పదేళ్లలో రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓటేందుకు వేయాలి? అని ప్రశ్నించారు. మెగా డీఎస్పీ అని దగా డీఎస్పీ ఇచ్చారని ఆరోపించారు. కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడు. వీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచి..సిద్ధమంటూ బయల్దేరారు అని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగను అని . ఇప్పుడు వారే మద్యం అమ్ముతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని షర్మిల వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.



Next Story

Most Viewed