- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో మరో సంచలనం.. ప్రజల్లోకి షర్మిల.. ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల మరో సంచలనానికి తెర తీశారు. ఇలా పార్టీలోకి అలా బలోపేతంపై దృష్టి సారించారు. మరో రెండు రోజుల్లో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇచ్చాపురం నుంచి ఇడుపుల పాయవరకు పర్యటించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి జిల్లాల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో చర్చించి కొత్త కార్యచరణకు శ్రీకారం చుట్టనున్నారు. రూట్ మ్యాప్ సిద్దం చేసిన తర్వాత ఆమె జిల్లాల పర్యటనకు బయల్దేరి వెళ్తారు. మొత్తం 9 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేశారు. ప్రతి రోజు 2 జిల్లాల సమన్వయకర్తలతో ఆమె భేటీ కానున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఈ టూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆశావహుల నుంచి కూడా ఆమె దరఖాస్తులు స్వీరించనున్నారు.
ఇందుకోసం మరికాసేపట్లో ఏపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. అధ్యక్షురాలిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అధ్యక్షతన తొలి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మయప్పన్, పళ్లంరాజు, జేడీ శీలం, కేవీపీ, రఘువీరారెడ్డి హాజరుకానున్నరు. షర్మిల జిల్లాల పర్యటనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అటు కాంగ్రెస్‌లో చేరికలపైనా సమాలోచనలు చేయనున్నారు.