Big Breaking: మా కుటుంబం విడిపోయిందంటే కారణం ఆయనే.. YS Sharmila

by Indraja |   ( Updated:2024-01-25 10:04:48.0  )
Big Breaking: మా కుటుంబం విడిపోయిందంటే కారణం ఆయనే.. YS Sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్ర రాష్ట్రాన్ని, అలానే తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని నిన్న జగన్ వ్యాఖ్యానించిన విషయం అందరికి సుపరిచితమే. అయితే నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందిచారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఇలా ముక్కలు కావడానికి మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు.

జగనన్న చేజేతులా చేసిన చర్యలే ఈ రోజు ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. జగనన్న కారణంగానే తమ కుటుంబం విడిపోయింది అని చెప్పడానికి ఆ దేవుడు, తమ తల్లి విజయమ్మ, యావత్‌ కుటుంబమే సాక్ష్యం అని పేర్కొన్నారు. జగన్ ప్రతి ఒక్కర్ని మోసం చేసాడు. వైసీపీ సమస్యల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. కాగా వాళ్ళను పార్టీ లో ఉండాల్సిందిగా కోరుతూ వాళ్ళకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇచ్చిన మాట నిలుపుకోకుండ జగన్ వాళ్ళను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తాను వైసీపీ కోసం నెలల తరబడి తన ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి.. ఎండనక, వాననకా 3,200కి.మీ పాదయాత్ర చేసి.. తెలంగాణాలో ఓదార్పు యాత్రలు చేపట్టి.. సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర చేసి.. స్వలాభం చూసుకోకుండా జగనన్నగెలుపు కోసం అహర్నిశలు కృషిచేసినట్లు తెలిపారు. అయితే జగన్ అధికారం లోకి వచ్చాక పూర్తిగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యకిగతంగా అన్యాయం చేసిన పర్లేదు.. కానీ రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నట్లు వ్యల్లడించారు.

కానీ ప్రస్తుతం జగన్ తో పాటు వైసీపీ పార్టీ నేతలందరూ బీజేపీకి బానిసలైయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో బీజేపీ నుండి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయిన ఈ రోజు ఏపీ లో బీజేపి రాజ్యమేలుతుందంటే దానికి కారణం ఎవరు.. జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ చిన్న ఉపకారం కూడా చెయ్యలేదని.. అలాంటి పార్టీకి వైసీపీ ఎందుకు దాసోహమంటుందో అర్ధం కావడం లేదన్నారు.

ఇక ప్రత్యేక హోదా కోసం జగన్ ఏనాడూ ఉద్యమం చేయలేదని.. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిందీ లేదని ఆరోపించారు. మూడు రాజధానులు కడతాను అని చెప్పిన జగన్ ఈ రోజు ఒక్కటి కూడా కట్టలేక పోయారని.. ఈ రోజు దేశం లో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed