- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Polling: కడపలో ఓటు వేసిన వైఎస్ షర్మిల దంపతులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సీని ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఓటు వేశారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కడపలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా షర్మిల దంపతులు సందేశం ఇచ్చారు. ఈ పోలింగ్‌లో మంచి నేతలకే ఓటు వేయాలని కోరారు. కాగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. ఆమెకు ప్రత్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు, విచారణ, జరిగిన పరిణాలు అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ షర్మిల బహిరంగంగా విమర్శలు చేశారు. అటు వివేకా కుమార్తె వైఎస్ సునీత సైతం షర్మిలకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి చూపు కడప పార్లమెంట్‌పై ఉంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.