- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొదటిసారి చంద్రబాబు గడప తొక్కిన షర్మిల.. ఏపీ రాజకీయాల్లో సంచలనం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల వచ్చారు. తమ కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని శనివారం ఉదయం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. కాగా, కుమారుడి వివాహం నేపథ్యంలో మొదటిసారి చంద్రబాబు నివాసానికి షర్మిల రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు రాజారెడ్డి, అట్లూరి ప్రియా వివాహం ఫిబ్రవరి 17న జరుగనుంది.
తొలి ఆహ్వాన పత్రికను ఇడుపాలపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద పెట్టి.. ఆ తర్వాత వరుసగా అతిథులను షర్మిల ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే అన్న వైఎస్ జగన్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను పెళ్లికి ఆహ్వానించిన షర్మిల తాజాగా చంద్రబాబును ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్‌కు వైఎస్ షర్మిల పంపిన గిఫ్ట్, గ్రీటింగ్స్‌కు లోకేష్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే.