మరోసారి రెచ్చిపోయిన షర్మిల.. బాలకృష్ణ డైలాగ్‌‌తో సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు

by GSrikanth |
మరోసారి రెచ్చిపోయిన షర్మిల.. బాలకృష్ణ డైలాగ్‌‌తో సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వీకరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధమని ప్రకటించారు. ‘డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా సరే. ఎక్కడ అభివృద్ధి చేసినా చూపించండి. నేను మీడియాను తీసుకొని వస్తా’ అని రివర్స్ సవాల్ విసిరారు. రాజధాని లేకుండా నాలుగేళ్లు పాలించిన ఘనత వైసీపీదే అని అన్నారు. ఒక్క మెట్రో కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శించారు. నాలుగేళ్ల పాలన చూసి జగన్‌ రెడ్డిని విమర్శిస్తుంటే.. వైసీపీ నేతలు ఫీలవుతున్నారని మండిపడ్డారు. ‘సరే జగన్ రెడ్డి అంటే మీకు ఇబ్బందిగా ఉంటే.. ఇకనుంచి జగనన్నా అని పిలుస్తా’ అని ఘాటు కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో అభివృద్ధి శూన్యం అని షర్మిల విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటరిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు, మాతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారని, అందువ్ల ఇక్కడి పరిస్ధితులు తెలియదని దుయ్యబట్టారు. తాజాగా.. సుబ్బారెడ్డి కామెంట్లపై షర్మిల రియాక్ట్ అయి సీరియస్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story