- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ భారతి నెల జీతం రూ.32.50 లక్షలు.. ఎలాగో చెప్పిన ఆనం వెంకట రమణారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతికి నెల జీతంపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భారతికి ప్రతీ నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ సభలో తాను పేదవాడిని అని పదేపదే ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ భారతికి ప్రతి నెలా 1న చెక్కు రూపంలో రూ.32.50లక్షలు వస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి చెప్పుకొచ్చారు. పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. 1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్‌లో షేర్లు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. భారతి సిమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని ఆనం వెంకట రమణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్‌కు మాత్రం తక్కువ జీతం ఉందని ఆనం వెంకట రమణారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందని పేర్కొన్నారు. జగన్‌కు కూడా భారతి సిమెంట్స్‌లో రూ.2.38 కోట్ల షేర్లు ఉన్నాయని...వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.2,380 కోట్లు అని ఆనం వెంకట రమణారెడ్డి చెప్పుకొచ్చారు.
జగన్ అఫిడవిట్‌లో తప్పులు
భారతి సిమెంట్స్‌లో వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఏమీ లేదని జగన్ చెప్పారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. కానీ వాస్తవానికి జగన్ దంపతులకు భారతి సిమ్మెంట్స్‌లో రూ.4వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని అన్నారు. అలాగే వైఎస్ భారతికి సిలికాన్ బిల్డర్స్ లో 1.5 కోట్ల షేర్లు ఉన్నట్లు ఆనం వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. భారతి సిమ్మెంట్స్‌కు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణానికి భారతి సిమ్మెంట్‌నే వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. భారతి సిమ్మెంట్స్‌నే ఇళ్ల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం హుకుం జారీ చేయలేదని చెప్పుకొచ్చారు. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని నిలదీశారు. భారతి సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం చూపిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు.