Rain Alert:రాష్ట్రానికి భారీ వర్ష సూచన..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 14:55:39.0  )
Rain Alert:రాష్ట్రానికి భారీ వర్ష సూచన..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాలపై అధిక ప్రభావం..

విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని తెలిపారు. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు.


Advertisement

Next Story