మహిళల్లో పైల్స్ రావడానికి కారణాలు ఇవే...

by Sujitha Rachapalli |
మహిళల్లో పైల్స్ రావడానికి కారణాలు ఇవే...
X

దిశ, ఫీచర్స్ : హేమోరాయిడ్స్ లేదా పైల్స్.. పురుషులు, స్త్రీలు ఇద్దరిని ప్రభావితం చేస్తాయి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌పై లేదా టాయిలెట్ బౌల్‌లో కనిపించే ఎర్రటి రక్తం... తరచుగా అంతర్గత హేమోరాయిడ్లతో సంబంధం కలిగి ఉంటుంది. బాహ్య హేమోరాయిడ్లు ముఖ్యంగా కూర్చున్నప్పుడు నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆసన ప్రాంతంలో నిరంతర దురద కలిగించవచ్చు. పాయువు చుట్టూ వాపును కలిగిస్తాయి. అయితే మహిళల్లో పైల్స్ రావడానికి కారణాలు భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

గర్భం

గర్భం స్త్రీలలో హేమోరాయిడ్‌లను డెవలప్ చేస్తుంది. కెనడియన్ ఫ్యామిలీ ఫిజిషియన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... దాదాపు 25 నుంచి 35 శాతం మంది గర్భిణీ స్త్రీలు హేమోరాయిడ్స్‌తో బాధపడుతున్నారు. గర్భధారణ సమయంలో పెరుగుతున్న గర్భాశయం పెల్విక్ సిరలపై ఒత్తిడిని కలిగిస్తుంది, శరీరపు దిగువ భాగం నుంచి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మల సిరలపై ఈ పెరిగిన ఒత్తిడి ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో పైల్స్‌కు దారితీస్తుంది.

ప్రసవం

ప్రసవ సమయంలో తీవ్రమైన ఒత్తిడి పురీషనాళ ప్రాంతంలో సిరలు ఉబ్బి, హేమోరాయిడ్స్‌కు దారితీస్తుంది. PLOS Oneలో ప్రచురించబడిన అధ్యయనంలో .. బిడ్డకు జన్మనిచ్చిన వారిలో 68.7 శాతం మందికి హేమోరాయిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. యోని డెలివరీ సమయంలో నెట్టబడటం వల్ల చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత హేమోరాయిడ్‌లను అనుభవిస్తారు.

హార్మోన్ల మార్పులు

హార్మోన్ల హెచ్చుతగ్గులు స్త్రీ జీవితంలో వివిధ దశలలో సంభవించవచ్చు. ఈ హెచ్చుతగ్గులు గర్భధారణ సమయంలో మాత్రమే కాకుండా పీరియడ్స్ టైంలో కూడా జరుగుతాయి. ఇది జీర్ణవ్యవస్థలో మార్పులకు కారణం కావచ్చు. కొన్నిసార్లు మలబద్ధకానికి దారితీయవచ్చు. ఇది హేమోరాయిడ్ల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

వృద్ధాప్యం

వృద్ధాప్యం వచ్చేశాక స్త్రీలలో ముడతలు మాత్రమే మార్పు కాదు. పురీషనాళం, పాయువులోని సిరలకు మద్దతు ఇచ్చే కణజాలాలు కూడా బలహీనపడతాయి, తద్వారా అవి హెమోరాయిడ్స్ లేదా పైల్స్‌కు గురయ్యే అవకాశం ఉంది. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. హెమోరాయిడ్స్ మహిళల్లో, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తాయి

Advertisement

Next Story

Most Viewed