AP News:‘కూటమి కుట్రలన్ని తిప్పికొడతాం’..వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘కూటమి కుట్రలన్ని తిప్పికొడతాం’..వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల ముందు గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నేడు(మంగళవారం) వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కుట్రలన్నీ తిప్పికొడతాం అన్నారు. వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది..కొంతమంది వైసీపీ సింబల్‌తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుంది అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓటింగ్ మాకున్నా, వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే..వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం అవుతుంది అని తెలిపారు. మా అధ్యక్షుడు జగన్ కూడా పదే పదే చెబుతుంటారు. కచ్చితంగా ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో రేపు(బుధవారం) జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై చర్చించి, ఎన్నికల కోసం దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story