తెలంగాణ ఎన్నికల్లో బెట్టింగ్.. నిజం ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాలినేని

by srinivas |   ( Updated:2023-12-09 13:02:14.0  )
తెలంగాణ ఎన్నికల్లో బెట్టింగ్.. నిజం ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యే  బాలినేని
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాలపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30న తెలంగాణలో జరిగిన ఎన్నికలపై బెట్టింగ్ వేశానని ఆయన ఒప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తాను బెట్టింగ్ వేసినట్లు బాలినేని పేర్కొన్నారు. తన కుమారుడు సైతం బెట్టింగ్ కాశారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని, తన కుమారుడు అనుకున్నాడని బాలినేని చెప్పారు. కానీ ఈ సారి ఎన్నికలు అంత ఈజీ కాదని.. విభిన్నంగా ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఒక్కటే పని చేయదని, చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. తాను మాత్రం ఒంగోలు నుంచే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తనపై, తన కుమారుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలంటేనే చిరాకు వస్తోందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story