రైతులకు అందని పెట్టుబడి సాయం.. ప్రభుత్వంపై మాజీ మంత్రి అప్పలరాజు ఫైర్

by srinivas |
రైతులకు అందని పెట్టుబడి సాయం.. ప్రభుత్వంపై మాజీ మంత్రి అప్పలరాజు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వారాలు గడుస్తున్నా రైతులకి పెట్టుబడి సాయం అందలేదని సీదిరి మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల పంపిణీలో ప్రభుత్వం వివక్ష కనిపిస్తోందని మండిపడ్డారు. ఆర్బీకేల వద్ద కండువాలపై పెట్టే శ్రద్ధ.. అన్నదాతలని ఆదుకోవడంపై పెట్టాలని సూచించారు. టీడీపీకి ఓటు వేసిన వాళ్లకే విత్తనాలు ఇస్తారా? అని, వేరే పార్టీకి ఓటు వేసిన వారికి విత్తనాలు ఇవ్వరా అని మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ‘

‘ప్రజలు చాలా ఆశలు, అంచనాలతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. అత్యధిక మెజార్టీలు, సీట్లు ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పని చేస్తుందా లేదా అనేది మేం ప్రశ్నించడం లేదు. కానీ ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అందజేశాం. గత ఐదేళ్లలో ఎలాంటి అలస్యం లేకుండా నేరుగా రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేశాం. 53.5 లక్షల రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాం. ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం త్వరగా అందించే ఆలోచన చేయాలి. సీఎం చంద్రబాబుతో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడాలి. రైతు పెట్టుబడి పలానా తేదీని ఇస్తామని ప్రకటించాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మే నెలలోనే విత్తనాలు పంపిణీ చేశాం. రెండు వారాలుగా కూటమి నాయకులు రైతు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించారు. అదే రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. రైతు సంక్షేమం కోసం బ్రహ్మాండమైన ఇంధనం రైతు భరోసా కేంద్రం. ’’ అని అప్పల‌రాజు ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed