- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Political News: కంటైనర్ కథల్లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ
దిశ ప్రతినిది, విశాఖపట్నం: తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి రాంగ్ రూట్లో అనుమానాస్పదంగా వచ్చిన కంటైనర్ కథలు కూడా కంచికి చేరాయి. పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పడంతో ప్రతిపక్షాల ఆరోపణలుకు బలం చేకూరింది. దీనితో ఇది కూడా గతంలో వైసీపీ ప్రచారం చేసిన వివేకానంద రెడ్డి గుండె పోటు కథలాంటిదే అంటూ సోషల్ మీడియా వైసీపీ కామిడీకి వేదికైంది.
ముఖ్యమంత్రి పేషీ ఆమోదం, అనుమతి లేనిదే తాడేపల్లి బంగ్లా పరిసరాల్లోకి కాలు మోపడమే అసాధ్యం.. అలాంటిది ఎన్నికల సమయంలో ఏకంగా కంటైనర్ ముఖ్యమంత్రి బంగ్లాకు రాంగ్ రూట్ లో వెళ్లి అలాగే బయటకు వచ్చేయడంతో పలు సందేహాలు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక అది నోట్ల కట్టల కంటైనర్ అనే అనుమానాలను వెల్లువెత్తుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి పేషీ అధికారులు శరవేగంగా స్పందించారు. వైఎస్ జగన్ యాత్రకు సంబందించిన వంట పాత్రలు,సామాన్ల లోడ్ తో ఆ కంటైనర్ వచ్చిందని పేర్కొన్నారు. అయితే బుధవారం ప్రారంభమైన జగన్ పర్యటన కాన్వాయ్ లో ఆ కంటైనర్ కనిపించకపోవడం పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ఈ విషయం తెలియని ముఖ్యమంత్రి బాబాయి, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి ఇంటికి కంటైనర్ లో ఫర్నిచర్ వచ్చిందని తెలిపారు. అలానే ముఖ్యమంత్రి ఇంటికి ఫర్నిచర్ రాకుడదా అని ఎదురు ప్రశ్న వేశారు. నిజంగా ఫర్నిచరే అనుకొంటే పదవీ కాలం దాదాపు ముగిసిన సమయంలోనే వచ్చేది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి అనుమానాస్సద వాహనాలు గతంలో కూడా తాడేపల్లి బంగ్లాకు వెళ్లాయని కొత్త ప్రచారం కూడా ప్రారంభమైంది. పార్టీ నేతలు ఎవరికీ వారు పొంతన లేకుండా మాట్లాడడం ప్రస్తుతం అటు విపక్షాల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో ఆకలితో ఉన్న ట్రోల్ల్స్ బ్యాచ్ కి ఆహరం దొరికినట్లు అయ్యింది. సోషల్ మీడియాలో వైసీపీ పై ట్రోల్ల్స్ జల్లు కురిపిస్తున్నారు.