ఏపీలో వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు.. భారీ క్యూలైన్లు

by srinivas |
ఏపీలో వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు.. భారీ క్యూలైన్లు
X

దిశ, వెబ్ డెస్క్: జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్ షాపులకు బంద్ ప్రకటించారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకూ మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మద్యం బాబులు వైన్ షాపులకు ఎగబడుతున్నారు. మూడు రోజులకు సరిపడా సరకు కొనుగోలు చేస్తు్న్నారు. విజయవాడలో వైన్ షాపులు కళకళలాడుతున్నాయి. మందుబాబులు భారీగా మద్యం కొంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తమకు నచ్చి బ్రాండ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మద్యంపై ఆదాయం భారీగా వస్తోంది.

మరోవైపు కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పోలింగ్ సమయంలో ఏర్పడిన ఘటన దృష్ట్యా కౌంటింగ్ సందర్భంగా భద్రతను టైట్ చేశారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నిబంధనలను ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ, పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed