AP News:ఇద్దరూ ఆ శాఖ మంత్రులే..అయినా.. ఎంత తేడా?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-08 06:37:10.0  )
AP News:ఇద్దరూ ఆ శాఖ మంత్రులే..అయినా.. ఎంత తేడా?
X

దిశ, డైనమిక్​ బ్యూరో:రాష్ట్రంలో ప్రధాన శాఖల్లో జలవనరుల శాఖ ఒకటి. దానికి ఓ పార్టీ నేత గతంలో మంత్రిగా వ్యవహరించారు. మరో పార్టీ నేత ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అయితే వారిద్దరి మధ్య పనితీరులో ఎంతో తేడా ఉందని నేడు అంతా చర్చించుకుంటున్నారు. వారు ఒకరు అంబటి రాంబాబు, కాగా మరొకరు నిమ్మల రామానాయుడు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 ఆగస్టులో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే తన వాగ్ధాటితో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రాంబాబును..ఆ పదవి బాధ్యతలు చేపట్టగానే ‘నోటి’ పారుదల శాఖ మంత్రి అంటూ అప్పట్లో టీడీపీ వారు విమర్శలు గుప్పించారు.

పైగా ఆ శాఖపై అంబటికి పట్టు లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. తన శాఖ గురించి మాట్లాడడం తప్పించి..టీడీపీ పై విమర్శలు చేయడంలోనే ఆయన ముందుండే వారనే విమర్శలు ఉన్నాయి. సంక్రాంతి స్టెప్పులు వేసి సంబరాల రాంబాబుగా కూడా పేరు తెచ్చుకున్నారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమంటూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించారని టీడీపీ విమర్శలు కూడా గుప్పించింది. ఆయనకు ముందు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్​కుమార్​ యాదవ్​ కూడా ఇదే తీరున మాట్లాడారు. ఇప్పుడు తాజాగా బుడమేరు పొంగింది. విజయవాడ మునిగింది. ఈ విపత్కర సమయంలో ప్రస్తుత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరును అంతా ప్రశంసిస్తున్నారు.

మూడు రోజుల రేయింబవళ్లు ఆయన అక్కడే మకాం వేసి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చే పనులను నిత్యం పర్యవేక్షించారు. దాదాపు 72 గంటలు నిద్రాహారాలు మాని వర్షం కురుస్తున్నా నిమ్మల పనితీరును మంత్రి లోకేష్​ శభాష్​ అంటూ ప్రశంసించారు. అదే విధంగా తుంగభద్ర గేట్ విరిగిన సమయంలో నిమ్మల ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. అంతకు ముందు కోనసీమ జిల్లాలో వర్షాలు కురవగా మంత్రి అనునిత్యం పర్యవేక్షించి చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఇదే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఓ పక్క గండ్లు పూడ్చే పనుల్లో ఉన్న మంత్రి నిమ్మల ఫొటోను, మరో పక్కన డ్యాన్స్ వేస్తున్న మాజీ మంత్రి అంబటి ఫొటోను ఉంచి నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

Advertisement

Next Story