Sharmila : ఓట్లు సీట్లు రాని మాకు..వచ్చిన మీకు తేడా ఏంటీ ? వైఎస్ జగన్ కు షర్మిల సూటి ప్రశ్న

by Y. Venkata Narasimha Reddy |
Sharmila : ఓట్లు సీట్లు రాని మాకు..వచ్చిన మీకు తేడా ఏంటీ ? వైఎస్ జగన్ కు షర్మిల సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS Jagan)పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila) మరోసారి ఫైర్ అయ్యారు. కేవలం 1.7శాతం ఓట్లు సాధించిన, రాష్ట్రంలో అస్థిత్వం లేని కాంగ్రెస్ గూర్చి, షర్మిల గూర్చి మాట్లాడటం అనవసరమంటూ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యా్ఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓట్ల విషయం పక్కన పెడితే జగన్ కు 38శాతం ఓట్లు వేసిన ప్రజలకు తను అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మాకు ఓట్లు సీట్లు రాలేదు కాబట్టి మేం అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు 11సీట్లు గెలిపించినా, 38శాతం ఓట్లు వేసినా మీరెందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు మాకు తేడా ఏంటని షర్మిల ప్రశ్నించారు.

తమ తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న పార్టీ, ఆయన త్యాగం చేసిన పార్టీ..జగన్ పుట్టక ముందున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అటువంటి పార్టీని విమర్శించే స్థాయికి జగన్ కు లేదన్నారు. ప్రజలు వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఓట్లు చీలవద్దన్న ఆలోచనతో టీడీపీ కూటమి వైపు మొగ్గడంతో కాంగ్రెస్ కు ఆశించిన ఓట్లు రాలేదన్న సంగతి మరువరాదన్నారు. జగన్ అరాచక పాలనను, హామీల ఎగవేతను నిరసించి ప్రజలు వైసీపీని ఓడించారని, పోలీసులను తన ఇంటి కుక్కల్లాగా వాడుకుని, హత్యా రాజకీయాలు చేసిన జగన్ కు ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారన్నారు. దేశంలోనే కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతోందని, ఏపీలోనూ పుంజుకుంటుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed