నన్ను కలవడానికి వస్తే నోటీసులివ్వడం ఏంటి?: నారా భువనేశ్వరి

by Seetharam |   ( Updated:2023-10-17 11:34:06.0  )
నన్ను కలవడానికి వస్తే నోటీసులివ్వడం ఏంటి?: నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కలిసేందుకు వచ్చిన వారికి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా.. రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి..తనకు మనో ధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది? అని భువనేశ్వరి ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వాళ్లు అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? అని మండిపడ్డారు. ప్రజలు, మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది? అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.

Read More..

ఉత్కంఠ: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Advertisement

Next Story