- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sankranthi: కోడిపందాలకు రెఢీ..! సిద్ధం చేసిన పందెం రాయుళ్లు
దిశ, పాలకొల్లు: సంక్రాంతి పండుగ అంటేనే ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందేలు గుర్తుకొస్తాయి. ఈ జిల్లాల్లో కోడి పందాలు తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సంక్రాంతి పండుగకు వచ్చి కోడిపందాలను తిలకించి బెట్టింగులు వేసుకుని ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారింది. డబ్బులు వచ్చినా పోయిన బాధపడకుండా అదోత్రిలుగా ఫీల్ అవుతూ ఉండడం విశేషం. ఈ పందాల నిర్వహణకు గత మూడు నెలలుగా నిర్వాహకులు బరులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పందెం కోళ్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది.
రూ.1000 కోట్లు చేతులు మారే అవకాశం..
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల్లో ఏకంగా 1000 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోడిపందాలు లక్షల రూపాయల్లో జరుగుతాయని అంటున్నారు. మద్యం ఏరులై పారుతుందని తెలుస్తోంది.
గుండాట లేకపోతే దండగే..
కోడిపందాలతో గుండాటలు కూడా లేకపోతే కోడిపందాలు దండగనని నష్టం తప్ప లాభాలు రావని, ఒక్కోసారి చేతి డబ్బులు కూడా పోతాయని నిర్వాహకులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోడిపందాలు తిలకించేవారు కూడా కోడిపందాలు కాకుండా గుండాట్లు చూసి మజా చేసేవారు 50% పై మంది ఉంటారని, అందువల్ల ఈసారి కోడిపందాలతో పాటు గుండాటలు కూడా మూడు రోజులు పోటు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం
ఇప్పటికే బుక్కైన హోటల్ రూములు..
కోడిపందాలు నిర్వహణకు నిర్వాహకులే కాకుండా, తిలకించేవారు కూడా అధిక సంఖ్యలో హోటల్ గదులు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు ప్రాంతాల్లో హోటల్ గదులన్నీ ఇప్పటికే ఖాళీ అయినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల పాటు నిర్వహణకు అనుమతులు?
ఈ సంక్రాంతి పండుగకు కూటమి ప్రభుత్వం అధికారం లో ఉండడంతో మూడు రోజులు పాటు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అనుమతులు ఇస్తారని, దీనికోసం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, కోడిపందాల ప్రియుడు రఘురాం కృష్ణంరాజు అనుమతులు ఇప్పిస్తారని ప్రచారం సాగుతోంది. అందువల్లే ఈసారి పండుగ అందరి అభిరుచి ప్రకారం జరుగుతుందని, దీనికోసం నిర్వాహకులు ఇప్పటినుంచి పెద్ద ఎత్తున బరులు దక్కించుకునేందుకు ప్రయత్నం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బరులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు చుట్టూ నిర్వాహకులు ప్రదక్షిణలు చేస్తున్నారు.