AP Rains:బలహీనపడిన రుతుపవనాలు..ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

by Jakkula Mamatha |
AP Rains:బలహీనపడిన రుతుపవనాలు..ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రాష్ట్రంపై ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో రుతుపనాలు బలహీనంగా మారాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏలూరు, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లాలో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. వచ్చే మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు.. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్లా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed