రైతులు ఎప్పుడు దరఖాస్తు పెడితే అప్పుడే కనెక్షన్ ఇస్తాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

by Seetharam |
రైతులు ఎప్పుడు దరఖాస్తు పెడితే అప్పుడే కనెక్షన్ ఇస్తాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగిందని...నవరత్నాలలో సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు)రూ. 46, 581 కోట్లు ఈ అక్టోబర్‌ నెలాఖరివరకు టారిఫ్‌ సబ్సిడీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా జగనన్న హౌసింగ్‌ కాలనీలకు ఇప్పటివరకు ఐదు లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఈ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా నిర్ణీత కాలపరిమితిలో ఇవ్వడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

సెకీతో ఒప్పందం

‘రైతులు ఎప్పుడు దరఖాస్తు పెడితే అప్పుడు కనెక్షన్‌ ఇస్తున్నాం. వచ్చే ఏడాదికి కూడా ఎస్టిమేట్స్‌ వేసుకుని దానికి తగిన విధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ‘సెకీతో కూడా ఒప్పందం చేసుకున్నాం...అది కూడా తక్కువ ధరకే ఒప్పందం చేసుకున్నాం. ఫలితంగా తొమ్మిది గంటలు పగటిపూట నిరంతర విద్యుత్‌ ఇవ్వచ్చు. స్మార్ట్‌మీటర్స్‌ ఏర్పాటుచేసి డీబీటీ ద్వారా ఇవ్వడం వల్ల రైతులకు కూడా విద్యుత్‌ చార్జీలు ఎంత చెల్లించాలో వారికి కూడా అర్ధమవుతుంది. వారు ఎంత లబ్ధిపొందారో వారికి తెలుస్తుంది, పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ. 52,015 కోట్లు గ్రౌండ్‌ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది.ఉద్యోగావకాశాలు కూడా 12,586 మందికి కల్పించడం జరిగింది’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కొత్త సబ్‌స్టేషన్ల ద్వారా అనేక మండలాలకు ఉపయోగకరంగా ఉంటుందని...లో ఓల్టేజ్‌ సమస్యలు లేకుండా చేయవచ్చని వ్యాఖ్యానించారు. సోలార్‌ ప్రాజెక్ట్‌ల వల్ల కూడా అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ ఇచ్చేందుకు అన్ని ఒడిదుడుకులు తట్టుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed