- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Jaganకు ఆర్ నారాయణమూర్తి సెల్యూట్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సెల్యూట్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జోగునాధునిపాలెం బహిరంగ సభలో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం సాకారం చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా... తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దయనీయ స్థితి నెలకొందన్నారు. భూములు పనికిరాకుండా పోవడంతో రైతాంగం తల్లడిల్లిందని చెప్పారు. రైతులు, ఆ ప్రాంత ప్రజల దుస్థితిని పరిశీలించి మంత్రి దాడిశెట్టి రాజా, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం జగన్‌ను కలిసి తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను వివరించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్‌కు వివరించడంతో అందుకు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని ఆర్ నారాయణమూర్తి కొనియాడారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు శాల్యూట్ అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశారు.