- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Visakha: పరవాడ ఫార్మాసిటీ కర్మాగారంలో అగ్నిప్రమాదం
దిశ, ఉత్తరాంధ్ర: లంకెలపాలెం వెళ్లే మార్గంలో గల పరవాడ ఫార్మసిటీ కంపెనీకి చెందిన కంపెనీ చెందిన పలు వ్యర్ధాలు నిలవచేసే కంపెనీ స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్స్ డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు ఇతర వ్యర్ధాలు దగ్ధమయ్యాయి. అంతేకాదు పొగలు చుట్టుపక్కల గ్రామాలకు అలుముకున్నాయి. దీంతో ప్రజలకు కళ్ళ మంటలు, శ్వాస ఇబ్బందులు పడ్డారు.
అయితే ఫార్మల్ సిటీ కంపెనీలో వచ్చే వ్యర్ధాలు వలన ప్రజలు ఎప్పటినుండో ఇబ్బందులకు గురవుతున్నానని ఆందోళన చేస్తున్నారు. అప్పుడప్పుడు అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. వీటిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తూతూ మంత్రంగా చెకింగ్ చేసి సూచనలు, ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజాగా జరిగిన అగ్నిప్రమాదంతో వ్యర్ధాల నుంచి వస్తున్న పొగతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారుల కఠినమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న పరవాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.