- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేది ఇక్కడే అంటున్న సీఎం?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విజన్ విశాఖ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖపట్నం నుంచి పాలన చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం సీఎం విజన్ విశాఖ సదస్సులో మాట్లాడుతూ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి వచ్చాక విశాఖ లోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ గా మార్చి అభివృద్ధితో పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విశాఖ ఆ స్థితికి చేరిందని చెప్పారు.
రాష్ట్రంలో చిన్న మధ్య తరగతి పరిశ్రమలలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. బెంగుళూరు కంటే విశాఖలోనే సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, కొన్ని మీడియా సంస్థలు కావాలనే విశాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ జిల్లా కార్యనిర్వాహక రాజధాని కావాలని కోరుకుంటున్నా వ్యక్తిని తానొక్కడినే నని, వైకాపా మాత్రమే అలా కోరుకునే పార్టీ కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, విడదల రజని, ఆదిమూలం సురేష్, గుడివాడ అమర్నాధ్ తదితరులు పాల్గొన్నారు. పలు పథకాలు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
Read More..
వైసీపీకి భారీ షాక్.. మరో కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే?