Vizag:విశాఖ అందాలు వర్ణనాతీతం:సుప్రీంకోర్టు న్యాయమూర్తి

by Jakkula Mamatha |
Vizag:విశాఖ అందాలు వర్ణనాతీతం:సుప్రీంకోర్టు న్యాయమూర్తి
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:విశాఖపట్నం అందాలు వర్ణనాతీతం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం కైలాసగిరి, తెలుగు మ్యూజియంను సందర్శించిన ఆయన అక్కడి అందాలను చూసి మంత్రముగ్దులయ్యారు. సెల్ఫి పాయింట్ వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకున్న ఆయన కైలాసగిరి కొండపై నుంచి విశాఖ అందాలను తనివితీరా చూశారు. కుటుంబ సభ్యులందరితో కలిసి అద్దాల ట్రైన్‌లో ప్రయాణించి ఆనంద పరవశం పొందారు. నాలుగు రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో మధుర స్మృతులను పొందానని గుర్తు చేసుకున్నారు.

ప్రకృతి సోయగాలకు, సహజసిద్ధమైన అందాలకు విశాఖపట్నం చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కైలాసగిరి, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. తెలుగు మ్యూజియంను సందర్శించి అక్కడి విశిష్టతలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి బృందం చిత్రాలు దిగారు. కైలాసగిరి, తెలుగు మ్యూజియం, ఇతర ప్రాంతాల విశేషాలు, వి.ఎం.ఆర్.డి.ఎ. జాయింట్ కమిషనర్ రవీంద్ర, లైజన్ అధికారిగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ యాసిన్, స్థానిక తహసీల్దార్ పాల్ కిరణ్ ఇతర అధికారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed