Visakha: జీవీఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం వాయిదా

by srinivas |
Visakha: జీవీఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం వాయిదా
X

దిశ, ఉత్తరాంధ్ర: ఈ నెల 15న విశాఖపట్నం నగరపాలక సంస్థలో జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య బడ్జెట్ సమావేశం వాయిదా వేశారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా వాయిదా వేసినట్లు జీవీఎంసీ కమిషనర్ పి రాజాబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకూ కోడ్ అమలులో ఉంటుందని, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story