Ap News: రైతు సేవా కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానం

by srinivas |
Ap News: రైతు సేవా కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానం
X
  • - ఆగ్రోస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి.చంద్రశేఖర్ బాబు

దిశ, ఉత్తరాంధ్ర (అనకాపల్లి): ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్ పి.చంద్రశేఖర్ బాబు తెలిపారు. ప్రతీ మండలానికి ఒక ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచే వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించవలసి ఉంటుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ పట్టభద్రులు ఈనెల 13 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ఆగ్రోస్ జిల్లా మేనేజరు వారిని సంప్రదించాలని, సందేహాలుంటే 95509 22465, 8658990258 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed