- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha Dairy చైర్మన్‌గా ఆడారి ఆనంద్ కుమార్ నియామకం
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ డెయిరీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆడారి ఆనంద్ కుమార్‌ను డైరీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇటీవల ఆడారి తులసిరావు దివంగతులయ్యారు. డెయిరీ చైర్మన్‌గా 36 సంవత్సరాలు తులసిరావు పని చేశారు. 13 జిల్లాలలోని 2 లక్షల పాడి రైతులకు, వారి కుటుంబాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విశాఖ డెయిరీ ప్రస్తుతం 8.5 లక్షల లీటర్లు రోజు వారి పాల సేకరణ చేస్తోంది. 8.5 లక్షలు లీటర్ల పాలు విక్రయాలు చేస్తోంది. 1500 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. తులసిరావు చేసిన సేవలు, కృషిని స్మరిస్తూ డైరీ బోర్డు సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. బోర్డు మీటింగ్‌లో విశాఖ డెయిరీ తదుపరి చైర్మన్‌గా ఆడారి ఆనంద్ కుమార్‌ను కోళ్ల కాటమయ్య ప్రతిపాదించారు. బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతనంగా నియమితులైన ఆనంద్ కుమార్‌కు విశాఖ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీని అనంద్ కుమార్ మరింత ఉన్నత శిఖరానికి తీసుకెళ్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మేలైన పశు జాతి, పశుదాణా, పశు వైద్యాన్ని అందించి పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. పాడి రైతులకు ఆరోగ్య, సంక్షేమ పథకాల సేవలు అందిస్తూ విశాఖ డెయిరీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. ఎప్పటిలాగే వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాల అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని అనంద్ కుమార్ తెలిపారు.