వైసీపీకి భారీ షాక్..ముగ్గురు మాజీ కార్పొరేటర్‌లు జనసేనలో చేరిక

by Jakkula Mamatha |   ( Updated:2024-05-04 07:28:31.0  )
వైసీపీకి భారీ షాక్..ముగ్గురు మాజీ కార్పొరేటర్‌లు జనసేనలో చేరిక
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్‌లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. శుక్రవారం స్థానిక స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ 30 వార్డుకు చెందిన సుందరనేని శేషలత, 27 వ వార్డుకు చెందిన కల్లపల్లి వెంకట సీతారామరాజు (టాక్సీ రాజు) , వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ నారా అమ్మాజీతో పాటు వైసీపీ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, 37వ వార్డుకు చెందిన చింతపల్లి సత్యవతి తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నాయకులు సురా జగన్ , వైసీపీ తూర్పు నియోజకవర్గం యువ నాయకులు రావడ నారాయణ, శ్రీకాంత్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు. పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.

Advertisement

Next Story