- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్ముడితో టైట్ ఫైట్.. ఆ ఫ్లైట్లో ఢిల్లీకి అన్న..!
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని నానికి తమ్ముడితో తంటాలు వచ్చిపడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఆయనకు కాకుండా తమ్ముడికి సీటు ఖరారు చేయడంతో అటు అధిష్టానాన్ని, ఇటు తమ్ముడిని గుండుసూది మాటలతో పొడుస్తున్నారు. తమ నాయకుడి నిర్ణయమే శిరోధార్యం అంటూనే విమర్శల దాడి చేస్తున్నారు. మరోవైపు అధినేత ఒప్పుకున్నా లేకున్నా మళ్లీ పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారు. విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధించి ఢిల్లీకి వెళ్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ ఎంపీగా రెండు సార్లు కేశినేని గెలిచారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వేవ్‌లోనూ తట్టుకుని 2019లో రెండోసారి ఎంపీగా గెలిచారు. విజయవాడలో ఆయన చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను గెలిపించారని, తన ఊపరి ఉన్నంతవరకు సేవ చేసుకుంటానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత క్రమేపీ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. 2024 ఎన్నికల్లో కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు చిన్నీని రంగంలోకి దింపాలని అధినేత భావించారు. ఈ మేరకు ఆయనకే సీటు ఖరారు చేస్తూ ప్రకటించారు.
దీంతో పార్టీలో పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ్ముడికి టికెట్ ఇస్తారని ముందుగానే గమనించిన కేశినేని నాని చిన్నగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన వైసీపీ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. హాట్ కామెంట్స్ చేసి టీడీపీలో కాకపుట్టించారు. అలా కొద్ది రోజులు గడిచి తర్వాత మళ్లీ ఆయన తెలుగుదేశంలో యాక్టివ్ అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అటు అధినేత చంద్రబాబు కార్యక్రమాల్లో ఆయనే వెంటే నిడిచారు. ఇక చంద్రబాబు ఎలా చెబితే అలా నడుకుంటారనే నమ్మకాన్ని కలిగించారు.
కానీ బుధవారం జరిగిన టీడీపీ కార్యక్రమంలో కేశినేని నాని, చిన్ని మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇద్దరి వర్గం నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో స్థానిక పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అధిష్టానం స్పందించింది. కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేశినేని నాని మళ్లీ మాటల యుద్ధం మొదలు పెట్టారు. సుతిమెత్తంగా తనదైన శైల్లో విమర్శల దాడి చేశారు. చంద్రబాబు నిర్ణయం శిరోదార్యమంటూనే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనను వద్దని చంద్రబాబు అనుకున్నారని, కానీ తాను మాత్రం అనుకోలేదన్నారు. విజయవాడ ప్రజలకు తనపై నమ్మకం ఉందని, ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తాననే దీమా వ్యక్తం చేశారు. తానేం చేయాలనేది కాలమే నిర్ణయిస్తుందని, కానీ ఖాళీగా ఉంటే తన అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తాను మాత్రం చంద్రబాబుకు వెన్ను పోటు పొడవలేదని.. పొడిచి ఉంటే మంచి పదవిలో ఉండేవాడినని సున్నితంగా విమర్శించారు. మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధించి ఢిల్లీ వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకోకటి చూసుకోవాలని అని కేశినేని ఇన్ డైరెక్ట్‌గా ఇండికేషన్స్ ఇచ్చారు. అవరమైతే జెట్‌లోనైనా సరే హస్తినకు వెళ్తానని స్పష్టం చేశారు.
దీన్ని బట్టి కచ్చితంగా విజయవాడ ఎంపీగా పోటీ చేయడం గ్యారంటీ అని అర్ధమవుతోంది. మరి టీడీపీ ఫ్లైట్ కాదంటే వైసీపీ జెట్ ద్వారా ఢిల్లీ వెళ్తారేమో చూడాలి.