తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

by Javid Pasha |
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తెలిపింది. 10 రోజుల పాటు ఈ అవకాశం ఉంటుందని, నవంబర్ 10న ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 2.25 లక్షల టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది.

ఇక డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టికెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా రూమ్స్ బుకింగ్స్ చేసినవారికి 3 నుంచి 7 రోజుల్లో కాషన్ డిపాజిట్ చెల్లించడం జరుగుతుందని టీటీడీ తెలిపింది. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story