Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. ఇద్దరు సజీవదహనం

by srinivas |   ( Updated:2025-03-09 13:34:48.0  )
Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోరం..  ఇద్దరు సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు వ్యక్తులు సజీవదహన మయ్యారు. ఈ అన్నమయ్య జిల్లా(Annamaya District)లో జరిగింది. మదనపల్లి(Madanapalle) నుంచి ప్రయాణికులుతో కారు చింతామణి రోడ్ వైపు వెళ్తోంది. అయితే మదనపల్లి వైపు ఆర్టీసీ బస్సు(RTC Bus) దూసుకొచ్చింది. దీంతో మూలమలుపు వద్ద కారు(Car), ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు సజీవమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వేగంగా బస్సును ఢీకొట్టడం వల్లే కారు పెట్రోల్ ట్యాంకర్ లీక్ అయి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు రాబడుతున్నారు. సజీవ దహనమైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Next Story